ఎమ్‌టీవీ 'సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్' అందాల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో సిక్కిం రాష్ట్రానికి చెందిన మనీలా ప్రధాన్ విన్నర్‌గా నిలిచింది. తుది పోరులో ద్రిషా మోర్, ప్రియా సింగ్‌ను వెనక్కి నెట్టి ట్రోఫీని సొంతం చేసుకుంది. అంతే కాకుండా రూ.5 లక్షల నగదు బహుమతినీ గెలుచుకుంది.
"నా కల నెరవేరింది. నా జీవిత ప్రయాణంలో ఎన్నో అనుభవాలను నేర్చుకున్నాను. న్యాయ నిర్ణేతలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మాలిక, ఉజ్వలా గారికి ప్రత్యేక ధన్యవాదములు. వారు కొన్ని సందర్భాల్లో నా మీద కసురుకున్నారు, కానీ అదే చివరకు నా వ్యక్తిగత ఎదుగుదలకు తోడైంది."