తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కీర్తి సురేశ్​కు కరోనా ప్రతి వేవ్​లోనూ ఎదురుదెబ్బలే! - కీర్తి సురేశ్ పెంగ్విన్ మూవీ

Keerthy suresh movies: కరోనా ఎంత ప్రభావం చూపినా సరే తెలుగు సినిమా ఇండస్ట్రీ బలంగా నిలబడింది. చిన్నా పెద్దా సినిమాలతో హిట్​లు కొట్టి, వేరే సినీ పరిశ్రమలకు ధైర్యాన్నిచ్చింది. అయితే ఈ కరోనా టైమ్​లోనే కీర్తి సురేశ్​కు​ మాత్రం వరుసగా ఎదురుదెబ్బలే తగిలాయి! ఇంతకీ ఆ విషయం ఏంటంటే?

Keerthy Suresh
కీర్తి సురేశ్​

By

Published : Jan 31, 2022, 12:11 PM IST

Keerthy suresh news: ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్​కు అదృష్టం కలిసి రావడం లేదు. 'మహానటి' తర్వాత ఆమెకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. గత రెండేళ్ల కాలంలో కీర్తి నటించిన అర డజనుకు పైగా సినిమాలు బాక్సాఫీసు దగ్గర ప్రేక్షకులకు నిరాశనే మిగిల్చాయి!

కీర్తి సురేశ్ మూవీస్

2020 మార్చి చివరి వారంలో కరోనా వచ్చింది. ఆ వెంటనే దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. ఆ తర్వాత మూడు నెలలకు అంటే, జూన్ 19న కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్​ థ్రిల్లర్ 'పెంగ్విన్'.. అమెజాన్ ప్రైమ్​లో రిలీజైంది. కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.

కీర్తి సురేశ్ మిస్ ఇండియా మూవీ

అనంతరం కొవిడ్ సెకండ్ వేవ్​ టైమ్​లో అంటే నవంబరు 4న కీర్తి ప్రధాన పాత్రలో నటించిన మరో సినిమా 'మిస్ ఇండియా' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నెట్​ఫ్లిక్స్​లో నేరుగా రిలీజైన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది.

మిస్ ఇండియా మూవీ

Keerthy goodluck sakhi: ప్రస్తుతం థర్డ్​ వేవ్​లో 'గుడ్​లక్ సఖి' అంటూ వచ్చిన కీర్తి సురేశ్.. మరోసారి నిరాశపరిచింది! ఈ సినిమాలో హీరోయిన్​కు ఉన్నట్లే కీర్తి సురేశ్​ను కూడా బ్యాడ్​లక్ వెంటాడింది.

ఈ సినిమాలే కాకుండా నేరుగా థియేటర్లలోకి వచ్చిన 'రంగ్​ దే', 'అన్నాత్తే', 'మరక్కర్' కూడా అంతగా ఆదరణ దక్కించుకోలేకపోయాయి. ఈ సినిమాలన్నీ కూడా అంతంత మాత్రంగానే ఆడాయి!

mahesh sarkari vari pata: కీర్తి సురేశ్ ప్రస్తుతం మహేశ్​బాబు 'సర్కారు వారి పాట'లో హీరోయిన్​గా చేస్తోంది. అయితే మహేశ్​ సినిమాతో ఆమె తిరిగి లక్ ట్రాక్​ ఎక్కుతుందని​ అభిమానులు గట్టిగా అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

గుడ్​లక్ సఖి మూవీ

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details