తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రజనీ గురుదక్షిణ... కోటి రూపాయల ఇల్లు! - Super Star Rajini Gifted his Guru a house

సినీ పరిశ్రమలో తన గురువుగా భావించే సీనియర్ దర్శక నిర్మాత కలైజ్ఞానం​కు ఓ ఇల్లును బహుకరించి కృతజ్ఞత చాటుకున్నాడు తమిళ సూపర్​స్టార్ రజనీకాంత్​.

రజినీ కాంత్

By

Published : Oct 7, 2019, 6:19 PM IST

నటనతోనే కాకుండా.. నిరాడంబరత, నిజాయితీతో అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుడినీ ఆకట్టుకున్న హీరో సూపర్​స్టార్ రజినీకాంత్. తాజాగా సినీ పరిశ్రమలో తన గురువుగా భావించే దర్శకుడు కలైజ్ఞానం​కు ఓ ఇల్లును బహుమతిగా ఇచ్చి కృతజ్ఞత చాటుకున్నాడు.

కలైజ్ఞానమ్​ ఇంటిలో రజినీ

ప్రముఖ దర్శకుడు కలైజ్ఞానం​ సినీ పరిశ్రమకు చేసిన సేవను స్మరిస్తూ ఇటీవల ఓ అభినందన సభ ఏర్పాటు చేశారుకోలీవుడ్ ప్రముఖులు. ఆ కార్యక్రమంలోనే రజనీకాంత్ తన గురువుకు ఓ ఇల్లును బహుకరిస్తానని ప్రకటించాడు. ఇచ్చిన మాట ప్రకారం చెన్నైలోని విరుగాంబాక్కమ్​లో 3 పడక గదుల గృహాన్ని కొని ఆయనకు ఇచ్చాడు. దీని విలువ కోటి అని సమాచారం.

గృహప్రవేశానికి వచ్చిన సూపర్ స్టార్

ఆగస్టు 14న జరిగిన అభినందన సభలో... కలైజ్ఞానం​కు ఇప్పటికీ సొంత ఇల్లు లేదని, అద్దె ఇంట్లోనే ఉంటున్నాడని చర్చ జరిగింది. ఆయనకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు సినీ ప్రముఖులు. వెంటనే స్పందించిన రజినీ.. తనే ఇల్లు కట్టించి ఇస్తానని ప్రకటించాడు.

రజనీ సోలో హీరోగా నటించిన తొలి సినిమా ‘భైరవి’ (1978). ఈ సినిమాను కలైజ్ఞానం నిర్మించారు.కెరీర్ ఆరంభంలో సినిమా అవకాశాల్లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో కలైజ్ఞానం​ తనను ఆదుకున్నడని చెప్పాడు సూపర్​స్టార్​.

ఇదీ చదవండి: కర్నూలు బురుజు ముందు మహేశ్​ గొడ్డలివేట...!

ABOUT THE AUTHOR

...view details