కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. వీటితో పాటు ప్రజలు అనుసరించాల్సిన జాగ్రత్తలపై ప్రముఖులతో అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. తన కుమార్తె సితార చెప్పిన మాటలను ట్విట్టర్లో షేర్ చేశాడు.
'సితార' మాటల్లో కరోనా నియంత్రణ.. వినేయండి - మహేష్‌బాబు కూతురు సితార
కరోనా నియంత్రణపై హీరో మహేశ్ బాబు కుమార్తె సితార పలు విషయాలు పంచుకుంది. తన చిట్టి మాటలతో ప్రజలకు అవగాహన కల్పించడానికి ముందుకొచ్చింది. ఈ వీడియోను మహేశ్ ట్విట్టర్లో పంచుకున్నాడు.
!['సితార' మాటల్లో కరోనా నియంత్రణ.. వినేయండి Super Star Mahesh's daughter sitara wants to tell some steps to avoid carona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6560733-620-6560733-1585298434677.jpg)
ఐదు అంశాలు కచ్చితంగా పాటించాలంటోన్న 'సితార'
కరోనా వైరస్ దరి చేరకుండా ఉండాలంటే 5 ముఖ్యమైన అంశాలు పాటించాలని ప్రజలకు సూచిస్తోంది సితార. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించాలంటే ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్న సితార... సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని తన చిట్టిచిట్టి మాటలతో విజ్ఞప్తి చేస్తోంది.
ఇదీ చూడండి.. త్రివిక్రమ్ దర్శకత్వంలో మరోసారి బన్నీ!
Last Updated : Mar 27, 2020, 5:21 PM IST