ఈ సంక్రాంతికి 'సరిలేరు నీకెవ్వరు' అంటూ అభిమానుల్ని పలకరించాడు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు. బాక్సాఫీస్ వద్ద చక్కటి వసూళ్లు రాబడుతోందీ చిత్రం. ఇదే జోష్‌లో తన తర్వాతి సినిమాను ఇప్పటికే ప్రకటించేశాడు. తనతో 'మహర్షి' వంటి హిట్ తీసిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. అయితే ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడనే వార్త ఆసక్తి కలిగిస్తోంది.
సూపర్‌స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ? - mahesh babu with director vamshi paidipally
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తర్వాతి సినిమాలో హీరో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడనే వార్త.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది నిజమా? కాదా? తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు-హీరో విజయ్ దేవరకొండ
మరికొద్ది రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లనుందీ సినిమా. సూపర్‌స్టార్ మహేశ్ స్పైగా కనిపించనున్నాడని సమాచరం. ఇందులో విజయ్.. ఈ హీరోతో కలిసి తెర పంచుకోబోతున్నాడు. అలాగని ఇదేం మల్టీస్టారర్ కాదు. రౌడీ హీరో ఉండేది కొద్ది నిమిషాలు మాత్రమే. అయినా ఆ పాత్ర ప్రధానాకర్షణగా నిలవనుందట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు.
Last Updated : Feb 28, 2020, 6:42 PM IST