Mahesh Babu surgery: సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు శస్త్రచికిత్స జరిగింది. కొంతకాలంగా ఆయన మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల నొప్పి తీవ్రమవడం వల్ల శస్త్ర చికిత్స చేయాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో మహేశ్ కుటుంబ సమేతంగా స్పెయిన్ వెళ్లారు. అక్కడే శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం విశ్రాంతి నిమిత్తం దుబాయ్ వచ్చారు. పూర్తిగా కోలుకునే వరకూ మహేశ్ అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది.
Mahesh Babu surgery: సూపర్‌స్టార్ మహేశ్‌కు సర్జరీ.. షూటింగ్‌కు బ్రేక్ - మహేశ్ బాబు సర్జరీ
సూపర్‌స్టార్ మహేశ్ బాబుకు మోకాలి శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
Mahesh Babu surgery
ప్రస్తుతం మహేశ్.. పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంలో నటిస్తున్నారు. కీర్తి సురేశ్ కథానాయిక. మహేశ్‌కు సర్జరీ జరగడం వల్ల ఆయన లేని సన్నివేశాలను చిత్రబృందం తెరకెక్కిస్తోంది. ఫిబ్రవరి నుంచి మహేశ్ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఏప్రిల్ 1, 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్.
Last Updated : Dec 14, 2021, 2:49 PM IST