తెలంగాణ

telangana

ETV Bharat / sitara

చాక్లెట్లు ఇచ్చి మహేశ్​తో ఆ సినిమా చేయించారు!

సూపర్​స్టార్ మహేశ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ సందర్భంగా గతంలో మహేశ్ తన గురించి, తన సిద్ధాంతాల గురించి చెప్పిన అంశాలు మీకోసం.

చాక్లెట్లు ఇచ్చి మహేశ్​తో ఆ సినిమా చేయించారు!
మహేశ్​బాబు

By

Published : Aug 9, 2020, 11:16 AM IST

ఈ రోజు మహేశ్‌ బాబు 45వ పుట్టిన రోజు.. సాధారణంగా మహేశ్‌ను చూస్తే అలా చెప్పాలనిపించదు. ఎందుకంటే ఎవరికైనా వయసు పెరుగుతుంటుంది. కానీ ఇతడిని చూస్తే మాత్రం వయసు తగ్గుతోందనిపిస్తుంది. 'రాజకుమారుడు' నుంచి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. మరి మహేశ్‌ తన గురించి ఏమంటున్నాడు? గతంలో వివిధ సందర్భాల్లో తన గురించి, తన సిద్ధాంతాల గురించి మహేశ్ చెప్పిన అంశాలివే

  1. 'నా సినిమాలు సూపర్‌హిట్‌ కావడం మాత్రమే కాదు... నేను చాలా మంచి కొడుకు' అని మా అమ్మా నాన్న; 'భర్తంటే ఇలా ఉండాలని నా భార్య', 'మై డాడీ ఈజ్‌ ది బెస్ట్‌' అని నా పిల్లలు అనుకుంటే అదీ సంపూర్ణ విజయం.
    కుటుంబంతో సూపర్​స్టార్ మహేశ్​బాబు
  2. ఇల్లు బాగుంటే మనం బాగుంటాం. ఈ మాటను ఎక్కువగా నమ్ముతాను. రోజంతా షూటింగ్‌లో కష్టపడి ఇంటికి వెళ్తే అక్కడ ప్రశాంత వాతావరణం ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతుణ్ని.
  3. ఖాళీ సమయంలో సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఈత కొట్టడం, పిల్లలతో ఆడుకోవడం చేస్తుంటాను.
  4. నాకు టెస్టు క్రికెట్‌ అంటే ఇష్టం. మహేంద్ర సింగ్‌ ధోనీ, విరాట్‌ కోహ్లీ అంటే ఇష్టం. ఇక చిరకాల అభిమాన అటగాడు అయితే సచిన్‌ తెందుల్కర్‌.
  5. హైదరాబాద్‌ బిరియానీ అంటే చాలా ఇష్టం. జంక్‌ఫుడ్‌ విషయానికొస్తే బర్గర్‌, పిజా ఇష్టపడతాను. ఎక్కువగా కాఫీ తాగుతాను.
  6. 'నిన్న, మొన్నటి గురించి ఆలోచించకు... ఇవాళ, ఈ క్షణంలో బతుకు. చేస్తున్న పనిలో, ఉంటున్న క్షణంలో పూర్తిగా లీనమైతే... అదే నిజమైన బతకడం. అదే జీవితానికి ఆనందం' - ఇదే నా జీవిత సిద్ధాంతం.
  7. అందరూ బాలీవుడ్‌కు ఎప్పుడు? అని అడుగుతుంటారు. నేనైతే బాలీవుడ్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. నాకు తెలుగు సినిమా రంగమే శ్వాస, ధ్యాస. ఇక్కడి ప్రజల ఆశీస్సులే ముఖ్యం. వీళ్లను ఆనందంగా ఉంచితే చాలు.
    సూపర్​స్టార్ మహేశ్​బాబు
  8. చారిత్రక చిత్రాలు చేయాలంటే నాకెందుకో భయం. అయితే రాజమౌళి లాంటివాళ్లు అలాంటి కథతో వస్తే కన్విన్స్‌ అయ్యే అవకాశం ఉంది.
  9. సినిమాల్లో నన్ను కన్‌ఫ్యూజ్‌ చేసే, టెన్షన్‌ పెట్టే విలన్లు ఉన్నారు గానీ, నిజ జీవితంలో మాత్రం ఎవ్వరూ లేరు. కన్‌ఫ్యూజనంతా నేను చేసిన పొరపాట్ల వల్లే జరిగింది. అది కూడా ఇప్పుడు పోయింది.. క్లారిటీ వచ్చింది.
  10. 'మనం చేసే పని వల్ల మనకు ప్రయోజనం ఉండాలి. ఎదుటివారికి ఇబ్బంది కలగకూడదు' ఇదీ నా ఫిలాసఫీ. దీన్నే అనుసరిస్తాను.
  11. ఇంట్లో చేసిన పిండి వంటలంటే చాలా ఇష్టం. అమ్మమ్మ వండిపెడితే పోటీపడి మరీ తినేవాణ్ని. ఇప్పుడు చాలా రకాల ఆహార పదార్థాలు తింటున్నా... అవి అమ్మమ్మ చేతి వంట రుచికి సాటి రావు.
    చిన్నప్పటి మహేశ్​బాబు
  12. నా సినిమాలకు ఉత్తమ విమర్శకుడు నాన్న. ఆ తర్వాతి స్థానం భార్య నమ్రతది.
  13. తొలి సినిమాలో నటించమని అడిగితే భయపడి పారిపోయా. యూనిట్‌ వాళ్లు పట్టుకుంటే నేను చేయను అని మారాం చేశా. బిస్కట్లు, చాకెట్లు ఇచ్చి నటింపజేశారు.
  14. స్కూల్లో ఎబౌ యావరేజ్‌ విద్యార్థిని. లెక్కలంటే చాలా భయం. పదో తరగతిలో లెక్కలో తక్కువ మార్కులొచ్చాయి. లయోలా కాలేజ్‌లో ఇంటర్‌ చదవాలనుకున్నా.. అయితే పదిలో తక్కువ మార్కులు రావడం వల్ల అక్కడ సీటు రాలేదు. అయితే బాగా చదివి డిగ్రీ అందులోనే చేశా.
  15. నాకు మన దేశంలో గోవా, విదేశాల్లో అయితే న్యూజిలాండ్‌ను ఇష్టపడతాను. పిల్లలకు సెలవు దొరికితే విహారయాత్రకు చెక్కేస్తాం.
  16. సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తగ్గించేశా కానీ.. పెళ్లి కాకముందు సాయంత్రం ఆరు గంటలకు కూర్చుంటే తెల్లవారుజాము నాలుగువరకూ చూస్తూనే ఉండేవాణ్ని.
  17. మార్వెల్‌ హీరోస్‌లో ఐరన్‌ మేన్‌, హల్క్‌ అంటే ఇష్టం.

ABOUT THE AUTHOR

...view details