తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాస్టార్ అల్లుడి సినిమా షూటింగ్ పునఃప్రారంభం - కల్యాణ్ దేవ్ సూపర్ మచ్చి

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'సూపర్ మచ్చి'. ఈ సినిమా షూటింగ్ నేడు రామానాయుడు స్టూడియోలో పునఃప్రారంభమైంది.

Super Machi shoot starts in Ramanaidu Studio
మెగాస్టార్ అల్లుడి సినిమా షూటింగ్ పునఃప్రారంభం

By

Published : Jun 22, 2020, 6:30 PM IST

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'సూపర్ మచ్చి'. పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. రచితా రామ్ హీరోయిన్​గా కనిపించనుంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా షూటింగ్​ తాజాగా ప్రారంభమైంది. అందుకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం.

సూపర్ మచ్చి షూటింగ్

హీరోహీరోయిన్లు కల్యాణ్, రచితతో పాటు అజయ్​లపై కొన్ని కీలక సన్నివేశాలను రామానాయుడు స్టూడియోలో చిత్రీకరిస్తున్నారు. కరోనా నియమ నిబంధలను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఇటు చిత్రీకరణతో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పనులనూ షురూ చేశామని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

సూపర్ మచ్చి షూటింగ్

ABOUT THE AUTHOR

...view details