తనదైన శైలి నటనతో తమిళ, తెలుగు సినీ ప్రేక్షకుల్ని అలరించిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ సామాజిక మాధ్యమ ఖాతాలు ఇటీవల హ్యాక్ అయ్యాయి. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించారు. తాజాగా ఆమె ట్విట్టర్ ఖాతా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా వరలక్ష్మి ట్విట్టర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
"నా అకౌంట్‌ను తిరిగి సాధారణ స్థితికి తెచ్చినందుకు ధన్యవాదాలు. తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది."