ప్రేక్షకులతో పాటు, విమర్శకులనూ మెప్పించిన తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్'. త్యాగరాజన్ కుమారరాజా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ మంచి విజయాన్ని అందుకుంది. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్ రాజా, గాయత్రీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎట్టకేలకు ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రిలీజ్కు మూహూర్తం కుదిరింది.
తెలుగులో 'సూపర్ డీలక్స్'.. ఆహాలో రిలీజ్ - ఆహాలో సూపర్ డీలక్స్
విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ తదితరులు కీలకపాత్రలు పోషించిన తమిళ చిత్రం 'సూపర్ డీలక్స్'. తాజాగా ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రిలీజ్కు రంగం సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా ఈ విషయాన్ని వెల్లడించింది.
![తెలుగులో 'సూపర్ డీలక్స్'.. ఆహాలో రిలీజ్ Super Deluxe](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12592298-447-12592298-1627397913259.jpg)
సూపర్ డీలక్స్
ఒకానొక దశలో ఈసినిమాను రీమేక్ చేయాలని కూడా భావించారు. కానీ, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఆహా ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి 'సూపర్ డీలక్స్' స్ట్రీమింగ్ కానుంది. దీంతో ఫ్యాన్స్ తమ సంతోషాన్ని తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.