తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దిల్లీలోనూ 'సూపర్​ 30' సినిమాకు ట్యాక్స్ లేదు

హృతిక్ రోషన్​ నటించిన 'సూపర్ 30' పై ట్యాక్స్​ను ఎత్తివేసింది దిల్లీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ట్విట్టర్​లో పంచుకున్నారు. ఇప్పటికే బిహార్, గుజరాత్​ల్లో ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు.

సూపర్ 30

By

Published : Jul 24, 2019, 10:24 PM IST

Updated : Jul 24, 2019, 11:43 PM IST

దిల్లీ ప్రభుత్వం.. 'సూపర్ 30' సినిమాకు ట్యాక్స్ ఫ్రీ హోదాను ఇచ్చింది. దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ విషయాన్ని ట్విట్టర్​లో తెలిపారు. ఇందుకు హీరో హృతిక్ రోషన్ ధన్యవాదాలు తెలిపాడు.

"దిల్లీ ప్రభుత్వం 'సూపర్ 30'పై పన్నును ఎత్తేసింది. ఆనంద్ కుమార్​ను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలి" -మనీశ్ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి

"దేశ భవిష్యత్తుకై చిత్ర బృందం చేసిన ప్రయత్నంలో మీరు సహకరించినందుకు ధన్యవాదాలు మనీశ్ సిసోడియా జీ.. " -హృతిక్ రోషన్, హీరో

హృతిక్​ ట్వీట్​కు స్పందించారు మనీశ్ సిసోడియా.

"దిల్లీ ప్రభుత్వ పాఠశాలకు ఆనంద్ కుమార్​ను ఆహ్వానించాం. 11, 12 తరగతులకు నెలకో క్లాస్ చెప్పాలని అడగగా.. ఆయన అంగీకరించటం ఆనందంగా ఉంది. ఆయన శిక్షణలో విద్యార్థులు ఐఐటీ-జేఈఈ కలలను సాకారం చేసుకుంటారని నమ్ముతున్నా" -మనీశ్ సిసోడియా

ప్రతీ ఏడాది 30 మందికి ఐఐటీ-జేఈఈకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా తీశారు 'సూపర్ 30'.

ఇది చదవండి: 'దబాంగ్'​ తొలి ఎంపిక సల్మాన్​ కాదంట..!

Last Updated : Jul 24, 2019, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details