తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సన్నీ లియోనీ నయా వ్యాపారం షురూ - సన్నీ లియోనీ లోదుస్తుల బ్రాండ్ తెలుసా...?

అమెరికాలో పుట్టిన సన్నీలియోనీ ప్రస్తుతం బాలీవుడ్​లో నటిగా మంచి పేరు​ సంపాదించుకుంది. చేతినిండా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. హీరోయిన్​గా రాణిస్తోన్న ఈ అమ్మడు తాజాగా లోదుస్తుల వ్యాపారం మొదలుపెట్టింది.

సన్నీ లియోనీ లోదుస్తుల బ్రాండ్ తెలుసా...?

By

Published : Jul 10, 2019, 1:01 PM IST

పోర్న్​ స్టార్​గా ప్రస్థానం మొదలుపెట్టి ప్రస్తుతం బాలీవుడ్​లో నటిగా ఉన్న సన్నీలియోనీ... సరికొత్త అవతారం ఎత్తింది. వ్యాపారవేత్తగా మారి మహిళల లోదుస్తుల బ్రాండ్​ను ప్రారంభించింది. కథానాయికగా ఫుల్​ బిజీగా ఉన్న ఈ సుందరి.. 'ఇన్​ఫేమస్​ బై స్టార్ట్​ స్ట్రక్​' పేరుతో తన ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటోంది.

ఇన్​ఫేమస్​ ప్రారంభోత్సవంలో లియోనీ

ముంబయిలో మంగళవారం జరిగిన ఇండియా లైసెన్సింగ్​ ఎక్స్​పో -2019లో తన నూతన బ్రాండ్​ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచింది. ఇది దేశంలోనే అతిపెద్ద బ్రాండ్​ లైసెన్సింగ్​ వేదిక. ప్రజల్లోకి తీసుకెళ్లి వ్యాపారాన్ని మరింత పెంచకోడానికి బ్రాడ్​ఫోర్డ్​ లైసెన్స్​ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది సన్నీ. ఫలితంగా 262 బిలియన్ల డాలర్ల మార్కెట్​ విలువ కలిగిన సంస్థలో భాగమైంది.

సన్నీలియోనీ

" ఇన్​ఫేమస్​ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. రిటైల్​ రంగంలో మా ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేందుకు ఐఎల్​ఈ వంటి ఓ ప్రతిష్టాత్మక వేదిక దొరికింది. ఇన్​ఫేమస్ బ్రాండ్​ను ​వయసుతో సంబంధం లేకుండా అందరి మహిళలు ఆదరిస్తారని ఆశిస్తున్నా".
-- సన్నీలియోనీ, సినీ నటి.

ABOUT THE AUTHOR

...view details