వీలైనంత త్వరలోనే భారత్‌కు తిరిగి వచ్చేస్తామని బాలీవుడ్ హాట్‌బ్యూటీ సన్నీలియోనీ చెప్పింది. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో తన భర్త డేనియల్ వెబర్, పిల్లలతో కలిసి సన్నీ అమెరికా వెళ్లారు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ పత్రికతో మాట్లాడిన సన్నీ... డేనియల్ కుటుంబ సభ్యుల కోసమే తాము అమెరికా వెళ్లామని తెలిపింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతులు దొరికిన వెంటనే ముంబయి వచ్చేస్తామని పేర్కొంది.
"ముంబయి వదలిరావడం వ్యక్తిగతంగా నాకెంతో బాధ కలిగించింది. చాలా రోజులపాటు ఆలోచించిన తర్వాతే అమెరికా వెళ్లాను. డేనియల్ కుటుంబ సభ్యులు అక్కడే ఉంటున్నారు. అయితే వాళ్లమ్మ వయసులో చాలా పెద్దవారు. ఆమెకు ఇప్పుడు మా అవసరం ఎంతో ఉంది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆమెను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే నేను అమెరికా వెళ్లాను. పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చి, అంతర్జాతీయ విమాన రాకపోకలకు అనుమతులు వచ్చిన వెంటనే భారత్‌కు వచ్చేస్తాం"