రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాటలకు కుర్రకారు ఉర్రూతలూగాల్సిందే. అతడి హుషారైన గీతాలు అలా ఉంటాయి. ఐటమ్ సాంగ్స్ అంటే ఇక చెప్పనక్కర్లేదు. అందులోనూ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన చిత్రాలకు మరింత ఎనర్జీతో పాటలందిస్తాడు దేవి. ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ మంచి గుర్తింపు పొందాయి. తాజాగా ఇదే కాంబోలో ఇప్పుడు 'పుష్ప' తెరకెక్కుతోంది.
'పుష్ప' ఐటమ్ సాంగ్ కోసం సన్నీ లియోనీ! - సన్నీ లియోనీ పుష్ప ఐటమ్ సాంగ్
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' తెరకెక్కుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఇప్పటికే సిద్ధమైంది. అయితే ఈ పాటలో నర్తించేందుకు బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీలియోనీని సంప్రందించిందట చిత్రబృందం.
ఈ చిత్రంలోని పాటలను ఇప్పటికే కంపోజ్ చేశాడట దేవి. అందులో ఓ ఐటమ్ సాంగ్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని టాక్. అయితే ఈ పాట కోసం సన్నీ లియోనీని తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఈ విషయంపై ఆమెను సంప్రందించగా భారీ మొత్తంలో డిమాండ్ చేసిందని వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం ఈ ఏడాది, రెండో భాగం వచ్చే ఏడాదిలో విడుదల చేయనున్నారు. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తుండగా.. రష్మిక హీరోయిన్గా చేస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్, బన్నీ ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై అంచనాల్ని పెంచేశాయి.