తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇక్కడే ఉండిపోవాలనుంది: సన్నీ లియోనీ - సన్నీ లియోనీ వార్తలు

చిత్రపరిశ్రమలో ఇప్పటివరకు సాగిన ప్రయాణంపై తాను సంతృప్తిగా ఉన్నట్లు తెలిపింది స్టార్​ హీరోయిన్​ సన్నీ లియోనీ. 'జిస్మ్​ 2' చిత్రంతో బాలీవుడ్​లో అడుగుపెట్టిన ఈ భామ.. తన కలలను నెరవేర్చుకునేందుకు సినీ ఇండస్ట్రీ సరైన ప్రదేశమని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించింది.

sunny leone wants to contiue in Cine Industry
ఇక్కడే ఉండిపోవాలనుంది: సన్నీ లియోనీ

By

Published : Apr 6, 2021, 8:36 AM IST

తొమ్మిదేళ్ల క్రితం హిందీ రియాల్టీ షో అయిన బిగ్‌బాస్‌లో పాల్గొని ఆకట్టుకున్న సన్నీ లియోనీ.. అదే ఏడాదిలో 'జిస్మ్ 2' సినిమాలో నటించి కుర్రకారుకు గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో బాలీవుడ్, దక్షిణాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.."ఇప్పటివరకు సాగిన నా సినీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. నేను నాకలలను కొనసాగించడానికి ఇదే సరైన ప్రదేశం అని భావిస్తున్నా. అందుకే నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నా. ఇక్కడే ఉండేందుకు ఎంతో సమయాన్ని కేటాయించాను. మరెన్నో విషయాలు తెలుసుకునేందుకు ఎదరుచూస్తున్నాను. ప్రస్తుతం 'ఎమ్‌టీవీ స్పిల్ట్స్ విల్లా' షోలో బిజీగా ఉన్నా" అని తెలిపారు.

ప్రస్తుతం ఆమె హిందీ-తెలుగులో తెరకెక్కుతున్న 'హెలెన్‌', 'కోకాకోల'లో నటిస్తోంది. విక్రమ్ భట్‌ దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్‌ సీరీస్‌ చిత్రం 'అనామిక'లో కీలకపాత్ర పోషిస్తోంది.

ఇదీ చూడండి:'శభాష్​ మిథు'.. ఆట షురూ!

ABOUT THE AUTHOR

...view details