వేధింపులను సహించకండి అని అంటోంది బాలీవుడ్ నటి సన్నీలియోనీ. తన స్టైల్‌తో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ.. ఇన్‌స్టా వేదికగా తరచూ ఎన్నో విశేషాలను షేర్ చేస్తూ ఉంటోంది. పని ప్రదేశాల్లో వేధింపులను మహిళలు సహించకండి అని చెబుతూ ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది.
పనివేళల్లో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి తెలియచేసేలా ఈ వీడియో ఉంది. ఇందులో సన్నీలియోనీ ఓ అధికారిలా కనిపించింది. "పనిచేసే చోట వేధింపులను తట్టుకోవడం చాలా కష్టం. ఇలాంటి వాటిపై మౌనంగా ఉండకండి" అని సన్నీ రాసుకొచ్చింది.