కరోనా సంక్షోభం నేపథ్యంలో దిల్లీలో ఉన్న 10 వేల మంది వలస కార్మికులకు ఆహారాన్ని అందించనున్నారు బాలీవుడ్ నటి సన్నీ లియోని. అందుకోసం ఆమె పాటు పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) సంస్థ కూడా భాగమైంది.
"ప్రస్తుతం మనమంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఇలాంటి సమయంలో అవసరమైన వారికి అండగా ఉండాలి. పెటా ఇండియాతో మరోసారి చేతులు కలపడం నాకు ఆనందంగా ఉంది. ఈసారి దిల్లీ నగరంలోని వేలాది కార్మికులకు అవసరమైన ఆహారాన్ని అందించాలని నిర్ణయించాం".
- సన్నీ లియోని, బాలీవుడ్ నటి