తనపై పెట్టిన చీటింగ్ కేసు గురించి ఎట్టకేలకు హాట్ బ్యూటీ సన్నీ లియోనీ మాట్లాడింది. ఈవెంట్ నిర్వహకులు అన్నీ అబద్ధాలు చెబుతున్నారని తెలిపింది. వాళ్ల వల్ల తను చాలాసార్లు షెడ్యూల్స్ మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఈ కేసు విషయమై కేరళ హైకోర్టుకు వెళ్లిన ఈ నటి.. ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసింది.
అసలేం జరిగింది?
కేరళకు చెందిన ఓ ఈవెంట్ సంస్థతో సన్నీ లియోనీ గతంలో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 2016 నుంచి పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనాలి. దీనికోసమే ఆమెకు రూ.29 లక్షలు కూడా ఇచ్చారు. అయితే తమ దగ్గర డబ్బులు తీసుకుని, ఈవెంట్లకు సన్నీ హాజరు కాలేదని ఈవెంట్ మేనేజర్ శియాస్, కేరళ డీజీపీకి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమెను విచారించిన పోలీసులు, వాంగ్మూలం తీసుకున్నారు.
అయితే ఈ విషయంలో తన తప్పు ఏం లేదని సన్నీ చెబుతోంది. ఈవెంట్ ఆర్గనైజర్ అబద్ధాలు ఆడుతున్నాడని తెలిపింది. కార్యక్రమాలు జరిగే తేదీల గురించి సరిగ్గా చెప్పకపోవడం వల్ల చాలాసార్లు మిగతా ప్రాజెక్టుల షెడ్యూల్స్ మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పింది. తనకు రావాల్సిన డబ్బు కూడా వారు సకాలంలో చెల్లించలేదని సన్నీ స్పష్టం చేసింది.
ఇది చదవండి:సన్నీ జీవితం ఓ తెరిచిన పుస్తకం