తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముద్దుగుమ్మ సన్నీ లియోనీ 'బ్రోకెన్ గ్లాస్' - సన్నీలియోనీ 'బ్రోకెన్‌ గ్లాస్‌' ఆర్ట్​

లాక్​డౌన్​తో ఇంటికే పరిమితమైన బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోనీ... తనలోని చిత్రకళను బయటకు తీసింది. 'బ్రోకెన్‌ గ్లాస్‌' పేరుతో ఓ కళా చిత్రాన్ని గీసింది. దానిని ట్విట్టర్​లో పంచుకుంది.

Sunny Leone Finishes 'Lockdown Piece of Art'
'బ్రోకెన్‌ గ్లాస్‌'... ఇది నా లాక్‌డౌన్‌ పీస్‌ ఆర్ట్

By

Published : Apr 28, 2020, 11:41 AM IST

Updated : Apr 28, 2020, 12:20 PM IST

సన్నీలియోనీ .. ఈ పేరు చెప్పగానే వెండితెరపై ఆమె వేడి వేడిగా వడ్డించే సొగసులు, ప్రత్యేక గీతాలే అందరికీ గుర్తొస్తాయి. కానీ, తనలో ఓ అద్భుతమైన చిత్రకారిణి ఉందని నిరూపించింది. లాక్​డౌన్ వేళ ఇంట్లోనే ఉన్న ఈమె... 'బ్రోకెన్‌ గ్లాస్‌' పేరుతో ఓ స్ఫూర్తిదాయకమైన కళాచిత్రాన్ని తన కుంచె నుంచి జాలువార్చింది. "ఇది నా లాక్‌డౌన్‌ పీస్‌ ఆర్ట్‌" అంటూ ట్విటర్‌ వేదికగా ఆ ఫొటోను పంచుకుంది.

"దీని పేరు 'బ్రోకెన్‌ గ్లాస్‌' (పగిలిన గాజు ముక్కలు). ప్రస్తుత మన జీవితాలకు అద్దం పడుతుంది. ఇక్కడ ప్రతిదీ ముక్కలైపోయినట్లుగా కనిపించొచ్చు. కానీ, ప్రతి ముక్క ఒకదానికొకటి అండగా ఉండేందుకు ఉద్దేశించినట్లుగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మనమంతా కలిసికట్టుగా పని చేయడం ద్వారా అలాంటి ఐక్యతా స్ఫూర్తిని అందరిలో రగిలించుకోగలుగుతాం" అంటూ ఓ వ్యాఖ్యను జోడించింది.

Last Updated : Apr 28, 2020, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details