తరచూ హాట్ హాట్ స్టిల్స్‌తో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కుర్రకారును ఫిదా చేస్తుంది బాలీవుడ్ నటి సన్నీ లియోనీ. ఈ మధ్యే సాగరకన్య అవతారంలో దర్శనమిచ్చి నెటిజన్ల మతిపోగొట్టింది. ఓ అందాల జలపాతం.. అప్పుడే ఒడ్డుకు చేరి సేదతీరుతున్న సాగరకన్యలా ఫొటోలో ఆమె కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది.
అనగనగా ఓ అందమైన సాగరకన్య.. - bollywood
బాలీవుడ్ నటి సన్నీ లియోనీ సాగరకన్యలా కనిపించి నెటిజన్ల మదిని దోచింది. "ఇలా సాగరకన్యలా కనిపించడాన్ని నేనెంతో ప్రేమిస్తున్నాను" అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.
ఇన్‌స్టాలో ఈ ఫొటోను షేర్ చేసిన సన్నీ.. "సాగరకన్యలా కనిపించడాన్ని నేనెంతో ప్రేమిస్తున్నాను" అంటూ కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.నెటిజన్లు తమదైన కామెంట్లతో సన్నీ ఫొటోపై ప్రేమ కురిపిస్తున్నారు. "నేను ఇన్నాళ్లకు ఓ నిజమైన సాగరకన్యను కనిపెట్టగలిగాను" అంటూ ఒకరు.. "నేనింత వరకు సాగర్యకన్యను చూడలేదు. ఒకవేళ ఇప్పడు చూసినా దానిలో నీకు మించిన అద్భుతమైన అందం నాకు కనిపించకపోవచ్చు" అంటూ మరొకరు వ్యాఖ్యానించారు.
ఇవీ చూడండి.. బాక్సాఫీస్ వార్: అవతార్ రికార్డుకు 'ఎండ్'గేమ్