సార్వత్రిక ఎన్నికల ఫలితాల లెక్కింపు జోరుగా సాగుతోంది. ఓ మీడియా ఛానెల్ అభ్యర్థుల ఆధిక్యాన్ని చెప్పే క్రమంలో పొరబడటం హాస్యాస్పదంగా మారింది.
ఆధిక్యంలో సన్నీ లియోని.. నెట్టింట వైరల్ - sunny deol
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న సన్నీ దేఓల్ పేరును సన్నీ లియోనిగా చదివిన ఓ ప్రముఖ మీడియా యాంకర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజన్లు.
సన్నీ లియోన్
బాలీవుడ్ హీరో సన్నీ దేఓల్ భాజపా తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అతడి పేరును ఓ ప్రముఖ మీడియో ఛానెల్ యాంకర్ పొరపాటున సన్నీ లియోని అని చదివాడు. ఆ వీడియో కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది. ఎన్నికల్లో సన్నీ లియోని పోటీ చేసిందా అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.