తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలయ్యతో బాలీవుడ్ నటుడి అమీతుమీ! - సునీల్ శెట్టి బాలకృష్ణ

నందమూరి హీరో బాలకృష్ణతో బోయపాటి శ్రీనివాస్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్ పాత్ర పోషించబోతున్నారని సమాచారం.

Sunil Shetty turns baddy for balakrishna
బాలయ్యతో బాలీవుడ్ నటుడి అమీతుమీ!

By

Published : Feb 15, 2021, 9:43 PM IST

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్​లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో బాలయ్యతో తలపడే విలన్​ను ఇంకా ఖరారు చేయలేదు. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కోసం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన సెట్​లో అడుగుపెట్టబోతున్నారట.

ఒకవేళ ఇదే నిజమైతే ఈ చిత్రం సునీల్ శెట్టి నటించబోయే మూడో తెలుగు సినిమా అవుతుంది. ఇప్పటికే ఆయన మంచు విష్ణు 'మోసగాళ్లు'తో పాటు వరుణ్ తేజ్ 'గని'లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. 'మోసగాళ్లు' మార్చి 19న రాబోతుండగా, 'గని' జులై 30న విడుదల కానుంది. అలాగే బాలయ్య-బోయపాటిల చిత్రం మే 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details