ప్రముఖ హాస్యనటుడు సునీల్.. రెండో ఇన్నింగ్స్‌లో కమెడియన్‌గా, హీరోగా నటిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పుడు అతడు తర్వాత చేయబోయే సినిమా గురించి ఆసక్తికర సమాచారం బయటకొచ్చింది.
'మండేలా' తెలుగు రీమేక్‌లో సునీల్? - sunil news
మరో తమిళ సినిమాను రీమేక్ చేసేందుకు మన దర్శకనిర్మాతలు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్టుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సునీల్
ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో నేరుగా రిలీజైంది 'మండేలా'. ఈ తమిళ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇప్పుడు ఈ సినిమాలో సునీల్ తెలుగులో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది.
పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో ఓటుకు ఉన్న విలువ గురించి చెప్పారు. ఒక్క ఓటైనా సరే ఎంత కీలకమో హాస్యభరితంగా చూపించారు. ఇందులో యోగిబాబు పోషించిన క్షురకుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారని టాక్. మరి దీనిపై స్పష్టత రావాలంటే కొన్నిరోజుల ఆగాల్సిందే.