తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సునీల్‌ హీరోగా ఆ సూపర్‌హిట్‌ రీమేక్‌! - బెల్​ బాటమ్​లో సునీల్​

కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రం 'బెల్‌బాటమ్‌'ను తెలుగులో రీమేక్​ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఇందులో నటుడు సునీల్​ ప్రధాన పాత్రలో నటిస్తారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశముంది

sunil
సునీల్​

By

Published : Dec 22, 2020, 6:57 PM IST

హాస్యనటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు సునీల్‌. కథానాయకుడిగానూ తానేంటో నిరూపించుకున్నారు. ఇటీవల కాలంలో మళ్లీ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, ప్రతినాయక ఛాయలున్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. ఒక భాషలో విజయవంతమైన చిత్రాలు మరో భాషలో రీమేక్‌ కావడం సహజం. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీమేక్‌ల హవా నడుస్తోంది. సునీల్‌ కూడా ఆ బాటలోనే ప్రయాణిస్తున్నారని టాక్‌.

రిషబ్‌శెట్టి కథానాయకుడిగా కన్నడలో ఘన విజయం సాధించిన చిత్రం 'బెల్‌బాటమ్‌'. ఇటీవల 'ఆహా' ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. డిటెక్టివ్‌గా రిషబ్‌శెట్టి నటన, రెట్రో థీమ్‌లో కథా, స్క్రీన్‌ప్లేలను దర్శకుడు జయతీర్థ నడిపించిన విధానం ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులో సునీల్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సునీల్‌ బాడీ లాంగ్వేజ్‌కు సరిగ్గా సరిపోయే కథ కావడం వల్ల ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అదే నిజమైతే మరోసారి సునీల్‌ తనదైన శైలిలో నవ్వించడం ఖాయం. మరి ఈ సినిమాను పట్టాలెక్కించేదెవరు? ఎవరు దర్శకత్వం వహిస్తారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరోవైపు 'పుష్ప', 'వేదాంతం రాఘవయ్య'తో పాటు పలు చిత్రాల్లో నటిస్తున్నారు సునీల్​.

ఇదీ చూడండి :బర్త్​డే స్పెషల్​ : 'మర్యాద రామన్న'

ABOUT THE AUTHOR

...view details