టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. త్వరలో తన అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది.. జీవితంలో చాలా విషయాలను పునఃపరిశీలించుకునేలా చేసిందని ట్వీట్ చేశాడు. తనకు సంతోషాన్ని కలిగించే వాటి గురించి ఆలోచించేలా చేసిందని అన్నాడు. కీలక నిర్ణయాలు తీసుకునే ధైర్యాన్ని ఇచ్చినట్లు తెలిపాడు.
టాలీవుడ్లో మరో హీరోకు త్వరలో పెళ్లి? - sandeep kishan marriage tweet
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే అతడు చేసిన ట్వీట్.. ఈ విషయమై ఆసక్తి రేపుతుంది. సోమవారం దీనిపై సస్పెన్స్ వీడనుంది.

సందీప్ కిషన్
ఈ క్రమంలోనే 'సోమవారం మీతో ఓ విషయాన్ని పంచుకోబోతున్నాను' అని సందీప్ కిషన్ ట్విట్టర్లో తెలిపాడు. మ్యాన్ ఇన్ లవ్ స్టిక్కర్ను కూడా దానికి జత చేశాడు. దీనిని చూసిన నెటిజన్లు.. సందీప్ కూడా త్వరలో పెళ్లి చేసుకోనున్నాడని భావిస్తున్నారు. ఆ విషయాన్నే వెల్లడిస్తాడని అనుకుంటున్నారు.