హీరోగా, నిర్మాతగా సందీప్ కిషన్ ఈ ఏడాది మంచి విజయాలు అందుకున్నాడు. 'నిను వీడని నీడను నేనే' సినిమాతో నిర్మాత, నటుడిగా సక్సెస్ అందుకున్నాడు. ఇటీవలే 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'తో కథానాయకుడిగా కమర్షియల్ హిట్ కొట్టాడు. ఈ సంతోష సమయంలో తల్లిదండ్రలకు బెంజ్ కారు బహుమతిగా ఇచ్చాడు.
సందీప్.. హీరో, నిర్మాత మాత్రమే కాదు. మంచి వ్యాపారవేత్త కూడా! జంట నగరాల్లో 'వివాహ భోజనంబు' పేరుతో పలు రెస్టారెంట్లు నడుపుతున్నాడు. ఇప్పుడు కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో త్వరలో ఒక సెలూన్‌ను ప్రారంభించనున్నాడు.