తన కెరీర్ తొలినాళ్లలో 'చిత్రం', 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' లాంటి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన హీరో ఉదయ్ కిరణ్. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి.. చాలా తక్కువ సమయంలో స్టార్‌గా ఎదిగి.. అంతే వేగంగా తన ప్రభను కోల్పోయాడు. వ్యక్తిగతంగా, సినీ కెరీర్‌లో ఎదురైన ఆటుపోట్లను తట్టుకోలేక, తీవ్ర ఒత్తిడి మధ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పుడీ కథానాయకుడి జీవితగాథ వెండితెరపైకి రాబోతుందట.
'ఉదయ్ కిరణ్' బయోపిక్‌లో హీరో సందీప్ కిషన్? - ఉదయ్ కిరణ్ బయోపిక్‌లో సందీప్ కిషన్
హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోందట. ఇందులో సందీప్ కిషన్ టైటిల్ రోల్ పోషించనున్నాడని సమాచారం. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది.
సందీప్ కిషన్-ఉదయ్ కిరణ్
ఉదయ్ కిరణ్ పాత్రలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించడం సహా స్వయంగా నిర్మించనున్నాడు. అయితే దర్శకుడు ఎవరనేది ఇంకా తెలియలేదు. ఇప్పటికే కథ సిద్ధమైందని, స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని సమచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
ఇది చదవండి: చిన్న వయసులో చనిపోయిన టాలీవుడ్ ప్రముఖులు వీరే..!