తెలంగాణ

telangana

ETV Bharat / sitara

11 ఏళ్ల సినీ ప్రయాణంలో సందీప్​ రూటే సెపరేటు! - సందీప్​ కిషన్​ బర్త్​డే

జ‌యాప‌జాయ‌ల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ వెళుతున్న యంగ్​ హీరో సందీప్ కిష‌న్.. ఈ ఏడాది 'ఏ1 ఎక్స్‌ప్రెస్‌'తో సంద‌డి చేశారు. ప్రస్తుతం 'గ‌ల్లీ రౌడి' సినిమాతో బిజీగా ఉన్నారు. శుక్రవారం(మే 7) సందీప్​ కిషన్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి గుర్తుచేసుకుందాం.

Sundeep Kishan birthday Special Story
11 ఏళ్ల సినీ ప్రయాణంలో సందీప్​ రూటే సెపరేటు!

By

Published : May 7, 2021, 2:14 PM IST

యువ కథానాయకుడు సందీప్ కిష‌న్ తన 11 ఏళ్ల సినీ ప్రయాణంలో ఇప్పటివరకు 27 చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన తొలి చిత్రం 'ప్రస్థానం' 2010 ఏప్రిల్ ‌16న విడుదలైంది. ఇందులో చిన్నా అనే పాత్ర పోషించి తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్​. సాయి కుమార్‌, శర్వానంద్‌ ప్రధానపాత్రల్లో దేవ కట్టా తెరకెక్కించిన చిత్రమది. రాజకీయ నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఆ సినిమాలో సాయికుమార్​ కుమార్‌ తనయుడిగా​ కనిపించి ఆకట్టుకున్నారు సందీప్​ కిషన్.

'వివాహ భోజనంబు' పోస్టర్​

ఆ తర్వాత 'స్నేహ గీతం', 'రొటీన్‌ లవ్ స్టోరీ', 'గుండెల్లో గోదారి' వంటి విభిన్న కథలు ఎంపిక చేసుకుని తనదైన ముద్ర వేశారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' చిత్రంతో కమర్షియల్‌ హిట్‌ అందుకున్నాడు సందీప్​. లవ్‌ స్టోరీలు చేస్తూనే కథాబలం ఉన్న చిత్రాల్లో నటించి తనను తాను నిరూపించుకున్నారు. నిర్మాతగానూ విజయాలు అందుకున్నారు. హాస్యనటుడు సత్య ప్రధానపాత్రలో 'వివాహ భోజనంబు' అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. సందీప్​ కిషన్​.. ప్రస్తుతం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న 'గల్లీ రౌడీ' చిత్రంలో నటిస్తున్నారు. నేహా శెట్టి కథానాయిక.

వీఐ ఆనంద్​తో కొత్త చిత్రం..

'ఎస్​కే 28' సినిమా అనౌన్స్​ పోస్టర్​

శుక్రవారం సందీప్​ కిషన్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా అప్​డేట్​ వచ్చింది. దర్శకుడు వీఐ ఆనంద్​తో సందీప్​ తన తర్వాతి చిత్రం కోసం పనిచేయనున్నారు. వీరిద్దరి కాంబోలో 2015లోనే 'టైగర్'​ అనే సినిమా రూపొందింది. ఈ కొత్త చిత్రానికి రాజేశ్​ దందా నిర్మాతగా వ్యవహరించనున్నారు. దేశంలో కరోనా సంక్షోభం తగ్గిన తర్వాత షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

ఇదీ చూడండి:ప్రేమకథలందు 'ఆర్య' కథ వేరయా!

ABOUT THE AUTHOR

...view details