తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీ బాటలో 'కపటధారి' సుమంత్‌! - అమెజాన్ ప్రైమ్​లో కపటధారి

సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'కపటధారి'. ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమవుతోందట చిత్రబృందం.

Sumanth's Kapatadhari on amazon prime
ఓటీటీ బాటలో 'కపటధారి' సమంత్‌

By

Published : Oct 27, 2020, 3:08 PM IST

Updated : Oct 27, 2020, 6:18 PM IST

'యువకుడు', 'గౌరి'లాంటి చిత్రాలతో నటించి మెప్పించిన ఏయన్నార్‌ మనవడు సుమంత్‌ యార్లగడ్డ. ప్రస్తుతం ఆయన ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో 'కపటధారి' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నందితా శ్వేత నటిస్తోంది. జి.ధనంజయన్‌ సమర్పణలో లలితా ధనంజయ్‌ నిర్మిస్తున్న చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు కూడా జరుగుతున్నాయి.

సుమంత్

ఈ చిత్రంలో సుమంత్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారిగా కనిపించిన పోస్టర్‌ ఇప్పటికే విడుదలై ఆకట్టుకుంటోంది. సుమంత్‌ సీరియస్‌ లుక్‌తో పాటు ఆర్టికల్‌ 352, ఎఫ్‌.ఐ.ఆర్‌.. వంటి ఆంగ్ల పదాలు, పుర్రె గుర్తుతో టైటిల్‌ లోగోను డిజైన్‌ చేయడం వల్ల వైవిధ్యంగా కనిపిస్తోంది. ఇందులో నాజర్‌, వెన్నెల కిశోర్‌ తదితరులు నటిస్తున్నారు. సైమన్ కె. కింగ్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.

Last Updated : Oct 27, 2020, 6:18 PM IST

ABOUT THE AUTHOR

...view details