హీరో సుమంత్.. ఈ ఏడాది ప్రారంభంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో ఏఎన్ఆర్గా ఆకట్టుకున్నాడు. మళ్లీ ఇప్పుడు కొత్త సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. మలయాళ హిట్ 'పడయోట్టమ్'రీమేక్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. గ్యాంగ్‌స్టర్ కామెడీ ఈ చిత్ర కథాంశం.
మలయాళ హిట్ రీమేక్‌లో హీరో సుమంత్ - Malayalam cinema telugu Remakes
కథానాయకుడు సుమంత్ కొత్త సినిమా ఖరారైంది. 'పడయోట్టమ్' అనే మలయాళ చిత్రం రీమేక్‌లో హీరోగా నటించనున్నాడు. డిసెంబరు నుంచి షూటింగ్ మొదలు కానుంది.
మాలయాళ హిట్ రీమేక్‌లో హీరో సుమంత్
డిసెంబరు 15 నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది. ఐమా హీరోయిన్గా పరిచయం కానుంది. విను యజ్ఞ దర్శకత్వం వహించనున్నాడు. ఈస్ట్ ఇండియా టాకీస్, ద మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శర్మ చుక్కా, జనార్ధనరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇది చదవండి: నాకు అలాంటి భర్త కావాలి: కాజల్