అక్కినేని సుమంత్ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో 'కపటధారి'లో నటిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను హీరో నాగచైతన్య విడుదల చేశారు. ఘన విజయం సాధించి, ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
'కపటధారి'గా సుమంత్ ఫస్ట్‌లుక్ - kapatadhari first look
టాలీవుడ్ సీనియర్ హీరో సుమంత్ నటిస్తోన్న 'కపటధారి' సినిమా ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు యువ హీరో నాగచైతన్య. ఇందులో ట్రాపిక్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
!['కపటధారి'గా సుమంత్ ఫస్ట్‌లుక్ sumanth Kapatadhari movie first look released](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8544022-136-8544022-1598288931889.jpg)
కపటధారిగా
ఈ పోస్ట్‌ర్‌లో ట్రాఫిక్ పోలీస్ అధికారిగా, చేతిలో రివాల్వర్‌తో కనిపించారు సుమంత్. నందితా శ్వేత కథానాయిక. థ్రిల్లర్ కథతో తీస్తున్నారు. నాజర్, జయ ప్రకాష్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.