తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెళ్లికి సిద్ధమైన మరో యువ హీరో.. ఎవరంటే? - Sumanth Ashwin MS raju

యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Sumanth Ashwin to tie the knot on the eve of Valentine's Day
పెళ్లికి సిద్ధమైన మరో తెలుగు హీరో

By

Published : Feb 3, 2021, 11:56 AM IST

టాలీవుడ్​లో మరో హీరో పెళ్లికి సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎమ్ఎస్ రాజు తనయుడు, కథానాయకుడు సుమంత్ అశ్విన్ వివాహం.. ఈనెల 13న దీపికతో జరగనుంది. ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు. అయితే ఈ కార్యక్రమానికి ఇరుకుటుంబాలు మాత్రమే హాజరు కానున్నాయి. గతేడాది చాలా మంది హీరోలు పెళ్లిళ్లు చేసుకున్నారు. నితిన్, రానా, నిఖిల్ తదితరులు ఆ జాబితాలో ఉన్నారు.

సుమంత్ అశ్విన్

సుమంత్ అశ్విన్ ప్రస్తుతం 'ఇదే మా కథ' సినిమాలో నటిస్తున్నారు. నలుగురు బైకర్లకు సంబంధించిన కథతో దీనిని తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇది చదవండి:2021లో మెగా హీరోల జోరు మామూలుగా లేదుగా..

ABOUT THE AUTHOR

...view details