తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నెటిజన్ల మనసు దోచుకున్న సుమ ఫొటో - Suma new photo

యాంకర్ సుమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఓ ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. ఇందులో ఆమె భర్త రాజీవ్ కనకాల భుజాలపై వాలి, కనులు మూసుకుని తన్మయత్వంతో కలిపించింది సుమ.

Suma shares photo
నెటిజన్ల మనసు దోచుకున్న సుమ ఫొటో

By

Published : Sep 14, 2020, 3:33 PM IST

Updated : Sep 14, 2020, 3:45 PM IST

యాంకర్‌ సుమ పేరు వినగానే మనకు ముందుగా గుర్తోచ్చేది వాక్చాతుర్యం. ఆమెను తెలుగు హీరోల అభిమానులంతా మెచ్చుకుంటుంటారు. ఎవరిని నొప్పించని మనస్తత్వం సుమది. అచ్చమైన తెలుగు కావాలంటే సుమ యాంకరింగ్‌ చూడాల్సిందే!

తాజాగా సుమ తన భర్త రాజీవ్‌ కనకాలతో కలిసున్న ఓ ఫొటోను తన ట్విట్టర్లో షేర్‌ చేసింది. అంతేకాదు ఆ చిత్రానికి 'మై డియర్‌ రాజా.. ఎప్పటికీ నా సంతోషం నీవే' అంటూ భర్తపై ప్రేమను ఇలా తెలిపింది. ఫొటోలో రాజీవ్‌ భుజాలపై వాలి, కనులు మూసుకుని భర్త చేయి పట్టుకుని తన్మయత్వంతో ఉంది సుమ. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

సుమ, రాజీవ్​ కనకాల విడాకుల వార్తలు ఈ మధ్య బాగా వైరల్​గా మారాయి. ఈ ఇద్దరి మధ్య విభేదాల కారణంగా విడిపోతున్నారంటూ గాసిప్స్ వచ్చాయి. సుమ,రాజీవ్‌తో ఎలాంటి సంబంధాలను కొనసాగించడం లేదంటూ పుకార్లు షికార్లు చేశాయి.

ఈ పుకార్లకు ఈటీవీలో ప్రసారమౌతున్న క్యాష్ ప్రోగ్రామ్​తో చెక్ పెట్టింది సుమ. భర్త రాజీవ్‌తో కలిసి వాళ్లు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారో తెలిసేలా చేసింది.

Last Updated : Sep 14, 2020, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details