Jayamma panchayathi teaser: తన కుమార్తె మహిళా ప్రాధాన్యత ఉన్న మంచి చిత్రంలో నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో కోరుకునేదానని ప్రముఖ యాంకర్ సుమ కనకాల తల్లి విమలమ్మ అన్నారు. తన ఆకాంక్ష 'జయమ్మ పంచాయితీ' సినిమాతో తీరిందని ఆనందం వ్యక్తం చేశారు.
'జయమ్మ పంచాయితీ' టీజర్ విడుదల కార్యక్రమానికి కుమార్తె సుమతో కలిసి వచ్చిన ఆమె.. టీజర్ చూసి ఎంతో సంతోషించారు. ఈ వేడుకల్లో రానా సమక్షంలో అభిమానులకు సుమ తన తల్లిని పరిచయం చేశారు. తన ఎదుగుదలకు విమలమ్మ ఎంతో శ్రమించారని సుమ చెప్పారు. అయితే తన కుమార్తె వ్యాఖ్యాతగానే కాకుండా మంచి నటి అని విమలమ్మ అన్నారు. సుమ 'జయమ్మ పంచాయితీ'.. మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.