సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైన్‌మెంట్ గేమ్ షో 'క్యాష్: దొరికినంత దోచుకో'(Cash Show). ఈ వారం షోలో బుల్లితెర తారలు హిమజ, అదిరే అభి, రోల్ రైడా, మహేశ్ విట్టా.. వాళ్ల అక్కాచెల్లెళ్లతో పాల్గొని సరదాగా సందడి చేశారు.
Cash Promo: అదిరే అభి కన్నీటిపర్యంతం - క్యాష్ కార్యక్రమం
సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న 'క్యాష్' షోలో(Cash Show) ఈ వారం బుల్లితెర తారలు హిమజ, అదిరే అభి, రోల్ రైడా, మహేశ్ విట్టా అతిథులుగా విచ్చేశారు. తమకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం నవ్వులు పూయించేలా ఉంది. దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి...
అభిపై సుమ వేసే పంచులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. సరదాగా సాగుతున్న షోలో.. కరోనా కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసి అభి ఉద్వేగానికి లోనయ్యారు. ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ తాను కరోనా బారిన పడ్డానని.. అదే సమయంలో తన చెల్లి దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిందని.. 15 రోజులపాటు తనను జాగ్రత్తగా చూసుకుందని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ చూడాలంటే జూన్ 19 వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకు దీనికి సంబంధించిన ప్రోమోను చూసేయండి..
ఇదీ చూడండి:'ఆ నటుడు బాల్కనీ నుంచి డబ్బులు విసిరేవారు'