తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సుమతో వార్నర్ ఫొటో..అసలు కథేంటి - డేవిడ్ వార్నర్

యాంకర్ సుమ.. క్రికెటర్​ వార్నర్​తో పాటు వీవీఎస్ లక్ష్మణ్, భువనేశ్వర్​తో కలిసి నటించారు. సంబంధిత ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

సుమతో వార్నర్ ఫోటో..అసలు కథేంటి

By

Published : Mar 20, 2019, 8:53 AM IST

Updated : Mar 20, 2019, 10:33 AM IST

ఒకరేమో గలగల మాట్లాడే యాంకర్, మరొకరు బౌండరీలు బాదే క్రికెటర్. వీరిద్దరూ కలిశారు. మాట్లాడుకోవడానికి అనుకున్నారేమో కానే కాదు. ఓ ప్రముఖ కంపెనీ ప్రకటన చిత్రీకరణ కోసం. సుమ కనకాల తన ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్న ఫొటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. వీరితో పాటు జట్టుకు మెంటార్​గా పనిచేస్తున్న వీవీఎస్ లక్ష్మణ్, పేసర్ భువనేశ్వర్ ఈ యాడ్​లో నటించారు. ఆ చిత్రాన్ని ట్విట్టర్​లో పంచుకున్నారు సుమ. రాబోయే సీజన్​లో బాగా ఆడాలని సన్​రైజర్స్​కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్ 12వ సీజన్​లో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది సన్​రైజర్స్ హైదరాబాద్​ జట్టు. ఈడెన్ గార్డెన్స్​లో జరిగే తొలి మ్యాచ్​లో కోల్​కతాతో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సంవత్సరం నిషేధం తర్వాత వార్నర్ రావడం... అతను ఎలా ఆడుతాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Last Updated : Mar 20, 2019, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details