తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రాజీవ్‌.. అందుకు నువ్వు బాధపడ్డావని తెలుసు' - లవ్​ స్టోరీ మూవీ

'లవ్‌స్టోరీ' చిత్రాన్ని (love story movie) వీక్షించిన ప్రముఖ యాంకర్ సుమ.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో నరసింహంగా నటించడానికి తన భర్త రాజీవ్‌ కనకాల (suma rajiv kanakala) ఎంతో బాధపడ్డాడని తెలిపారు.

suma rajiv kanakala
లవ్​ స్టోరీ మూవీలో రాజీవ్​ కనకాల

By

Published : Oct 1, 2021, 12:52 PM IST

'లవ్‌స్టోరీ'లో (love story movie) నరసింహంగా నటించడానికి రాజీవ్‌ కనకాల ఎంతో బాధపడ్డాడని ఆయన సతీమణి, ప్రముఖ వ్యాఖ్యాత సుమ (suma rajiv kanakala) అన్నారు. తాజాగా 'లవ్‌స్టోరీ' చిత్రాన్ని వీక్షించిన ఆమె చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, తన భర్త రాజీవ్‌ ఎంతో అద్భుతంగా నటించాడని పొగిడారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా 'లవ్‌స్టోరీ' నుంచి రాజీవ్‌ వర్కింగ్‌ స్టిల్స్‌ను సుమ షేర్‌ చేశారు.

"అతి తక్కువమంది నటీనటులు మాత్రమే తమ నటనతో మన మనస్సులను తాకుతారు. అలాంటి నటీనటుల్లో నా భర్త రాజీవ్‌ కూడా ఒకరు. నరసింహంగా ఎంతో అద్భుతంగా నటించినందుకు అభినందనలు. నాకు తెలుసు ఆ పాత్ర చేయడానికి నువ్వు ఎంతో బాధ, ఇబ్బందిపడ్డావని.. కానీ, ఎంతోమంది జీవితాలను నువ్వు ప్రభావితం చేశావు. ఇలాంటి సున్నితమైన కథను మరింత సున్నితంగా తెరకెక్కించిన శేఖర్‌కమ్ముల, చైతన్యలకు ధన్యవాదాలు. సాయిపల్లవి డ్యాన్స్‌ చూసి నా కళ్లు అలసిపోయాయి. డ్యాన్స్‌ ఎక్కడ మిస్‌ అవుతానోనని.. కంటి రెప్ప కూడా వాల్చలేదు. మరోసారి టీమ్‌ మొత్తానికి అభినందనలు" అని సుమ పేర్కొన్నారు.

లవ్​ స్టోరీ మూవీలో రాజీవ్​ కనకాల

ఫీల్‌గుడ్‌ ప్రేమ కథా చిత్రం 'లవ్‌స్టోరీ'లో రేవంత్‌గా నాగచైతన్య, మౌనికగా సాయిపల్లవి నటించారు. కుటుంబపోషణ నిమిత్తం పట్టణం వచ్చి జుంబా ట్రైనర్‌గా మారిన ఓ మధ్య తరగతి కుర్రాడిగా చైతూ తన నటనతో అందర్నీ మెప్పించాడు. ఇక, సాయిపల్లవి తన డ్యాన్స్‌తో ఫిదా చేసింది. సాయిపల్లవి బాబాయ్‌ పాత్రలో నటుడు రాజీవ్‌ నటించారు. కుటుంబసభ్యులే అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారనే విషయాన్ని శేఖర్‌ ఈ సినిమాలో ఎంతో సునిశితంగా చూపించారు.

ఇదీ చదవండి:ఈ హీరోయిన్ తెలుగమ్మాయి.. ఎవరో గుర్తుపట్టారా?

ABOUT THE AUTHOR

...view details