తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ సినిమా ఇచ్చిన ధైర్యంతోనే 'సుల్తాన్​' రిలీజ్!'

100 మంది సోదరులతో ఎలాంటి గొడవ లేకుండా నెట్టుకొచ్చే ఓ యువకుడి కథే 'సుల్తాన్'​ సినిమా కథాంశమని అన్నారు తమిళ హీరో కార్తి. ఆయన నటించిన ఈ చిత్రం ఏప్రిల్​ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు విషయాలను పంచుకున్నారు.

sultan
సుల్తాన్​

By

Published : Mar 31, 2021, 6:34 AM IST

Updated : Mar 31, 2021, 7:03 AM IST

'యుగానికి ఒక్కడు'తోనే తెలుగు పరిశ్రమలో అభిమానులను సంపాదించుకున్నారు. 'ఆవారా'తో లవర్​బాయ్​గా మారిపోయారు.​ 'ఊపిరి'తో తెలుగు నటుడైపోయారు. 'ఖాకీ'తో క్రైమ్‌ థిల్లర్‌ను చూపించి శబాష్‌ అనిపించుకున్నారు. 'ఖైదీ'గా యాక్షన్‌ హంగామా చేసి అందరినీ కట్టిపడేశారు. ప్రస్తుతం కార్తి నటించిన 'సుల్తాన్‌' చిత్రం ఏప్రిల్‌ 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. చిత్ర విశేషాలు సహా కెరీర్​ గురించి పలు విషయాలను పంచుకున్నారు.

తమిళనాడులో ఎన్నికల హడావిడి, దేశం మొత్తం కరోనా రెండోసారి విజృంభిస్తున్న ఈ సమయంలో ఏ నమ్మకంతో 'సుల్తాన్‌'ను విడుదల చేస్తున్నారు?

అక్కడ మా అందరికీ నమ్మకాన్ని ఇచ్చిన సినిమా 'మాస్టర్‌'. దానికి వచ్చిన కలెక్షన్లు మాలో ధైర్యం నింపాయి. ఇక తెలుగు పరిశ్రమలో ఇటీవల కాలంలో వచ్చిన హిట్‌ చిత్రాలు, ఇక్కడి ప్రేక్షకులు వాటిని ఆదరిస్తున్న తీరుతోనే 'సుల్తాన్‌'ను విడుదల చేస్తున్నాం. ఇది మంచికమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌. కుటుంబంతో కలిసి చూడతగ్గ చిత్రం. ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములుంటేనే గొడవలొస్తుంటాయి. అలాంటిది 100 మంది సోదరులతో ఎలాంటి గొడవ లేకుండా నెట్టుకొచ్చే యువకుడి కథ ఇది.

ఇంతమంది నటులు, సాంకేతిక సిబ్బందితో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ కష్టమనిపించలేదా?

అబ్బో చాలా కష్టాలు పడ్డాం (నవ్వుతూ). దర్శకుడు బక్కియరాజ్‌ కన్నన్‌, కెమెరామెన్‌, ఇతర సాంకేతిక సిబ్బంది మంచి వారు కుదిరారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అంతమందిని మెయింటెన్‌ చేస్తూ చిత్రీకరణ జరిపాం. అందరినీ ఒక చోటికి చేర్చడానికే ఎక్కువ సమయం పట్టేది.

'యుగానికి ఒక్కడు', 'ఖైదీ' చిత్రాలకు సీక్వెల్స్‌ ఎప్పుడు?

యుగానికి ఒక్కడు చిత్రీకరణకు మూడేళ్లు పట్టింది. మళ్లీ ఇప్పుడు వాళ్లు దానికి సీక్వెల్‌ ప్రకటించారు. దీని గురించి ఆలోచిస్తున్నా(నవ్వుతూ). ఇక 'ఖైదీ-2'కు కథ సిద్ధంగానే ఉంది. లోకేశ్‌ కనగరాజ్‌ ఇప్పుడు చాలా బిజీ. ఆయనతో సినిమా చేయడానికి రజనీకాంత్‌, కమలహాసన్‌... లాంటి హీరోలు ఆసక్తిగా ఉన్నారు. మా ఇద్దరికీ ఎప్పుడు కుదురుతుందో చూడాలి.

సహాయ దర్శకుడిగా పనిచేశారు కదా..! దర్శకత్వం చేసే ఆలోచనలు ఉన్నాయా?

దర్శకత్వం చేయడం చాలా కష్టం. ప్రస్తుతానికి ఆ ఆలోచనలేదు. ఇప్పుడు నటనపైనే నా దృష్టి. దర్శకత్వం చేయాలంటే... ముందు మంచి రచయితై ఉండాలి. నాకు రచన కొంచెం కష్టం. భవిష్యత్తులో అన్నీ కుదిరితే చేస్తా.

ఇదీ చూడండి: 'సుల్తాన్​'లో అసలు విలన్​ ఎవరన్నదే ట్విస్టు!

Last Updated : Mar 31, 2021, 7:03 AM IST

ABOUT THE AUTHOR

...view details