టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల ఎంపికలో జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇతడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరో చిత్రాన్ని ఓకే చేశాడు విజయ్. అయితే ఈ కాంబో మాత్రం ప్రేక్షకుల్ని తప్పుకుండా థ్రిల్‌కు గురిచేస్తుంది.
థ్రిల్లింగ్ కాంబో..సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - విజయ్ దేవరకొండ తాజా వార్తలు
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు.
సుకుమార్‌తో విజయం దేవరకొండ సినిమా
లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వచ్చింది. విజయ్ స్నేహితుడు కేదార్ సెలగంశెట్టి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుందీ మూవీ. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవనున్నాయి.
ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్‌తో 'పుష్ప' చిత్రం తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డా ఈ షూటింగ్ త్వరలోనే పునఃప్రారంభం కానుంది.