'పుష్ప' సినిమా చూసిన చాలామంది ప్రేక్షకులు.. 'ఊ అంటవా ఊహు అంటవా' అంటూ పాడుతూ థియేటర్ బయటకొస్తున్నారు. అంతలా ఆడియెన్స్‌కు కనెక్ట్ అయిందీ పాట. ఇందులో సమంత డ్యాన్స్, దానికి డీఎస్పీ మ్యూజిక్.. పాటను ఓ రేంజ్‌లోకి తీసుకెళ్లాయి. అయితే ఈ పాట కోసం సామ్‌ను ఎలా ఒప్పించారని ప్రశ్నించగా దర్శకుడు సుకుమార్ ఆసక్తికర సమాధానమిచ్చారు.
సుకుమార్ తీసే ప్రతి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కచ్చితంగా ఉంటుంది. ఈ డైరెక్టర్ గత చిత్రం 'రంగస్థలం'లోనూ పూజాహెగ్డే 'జిగేలు రాణి' గీతం.. ఇప్పటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సమంతనే.. 'పుష్ప'లో ప్రత్యేక గీతం చేస్తే బాగుంటుందని సుక్కు భావించారట.
అందులో భాగంగానే సామ్‌ను సంప్రదించగా.. తనకు ఈ పాట కరెక్ట్ కాదని చెప్పిందట. అయితే నటిగా ఇది మీకు కొత్తగా ఉంటుంది, ఈ సాంగ్ బాగా నప్పుతుందని సమంతతో చెప్పి ఒప్పించానని సుకుమార్ వెల్లడించారు. 'జిగేల్‌రాణి' పాట గురించి ప్రస్తావన తీసుకొస్తేనే నో చెప్పిన సమంత.. తన మాటపై నమ్మకంతోనే 'ఊ అంటవా ఊహు అంటవా' పాట చేసిందని సుక్కు చెప్పారు.