సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సినిమాలు ఎంతో కొత్తగా, క్రియేటివ్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఈయన కలం నుంచి మరో సినిమా రాబోతోంది. ఇటీవలే చిన్న చిత్రాలకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థను స్థాపించాడు. అందులోనే తను కథకు సహకారం అందిస్తూ, తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్న వారికి అవకాశం కల్పిస్తున్నాడు సుకుమార్. 'కుమారి 21 ఎఫ్', 'దర్శకుడు' వంటి సినిమాలు ఇలా వచ్చినవే. ఇప్పుడు మరో చిత్రానికి కథ అందించాడు సుకుమార్.
సుకుమార్ రైటింగ్స్ నుంచి మరో మూవీ.. హీరోగా నిఖిల్ - sukumar latest news
సుకుమార్ కలం నుంచి మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరో నిఖిల్ నటిస్తున్నట్లు తెలిపింది చిత్రబృందం.
![సుకుమార్ రైటింగ్స్ నుంచి మరో మూవీ.. హీరోగా నిఖిల్ sukumar giving strory and his assistant director doing this movie as a director with hero nikhil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5254771-381-5254771-1575382624543.jpg)
సుకుమార్‌తో కథలో నిఖిల్..!
'అర్జున్ సురవం'తో మంచి హిట్టందుకున్న నిఖిల్.. ఈ సినిమాలోకథానాయకుడుగాకనిపించబోతున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అల్లు అరవింద్ సపర్పణలో బన్ని వాసు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే కథానాయిక, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించనున్నారు.
ఇవీ చూడండి.. నూతన కథానాయికతో నాగ్ రొమాన్స్..!
Last Updated : Dec 3, 2019, 11:05 PM IST