ప్రముఖ దర్శకుడు సుకుమార్ స్నేహానికి ఎంత విలువిస్తాడో చాటిచెప్పాడు. తన తొలి స్నేహితుడు ఇతడే అంటూ కిష్టయ్య అనే వ్యక్తిని హైదరాబాద్లో ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కిష్టయ్యతో ఉన్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నాడు. అతడు కూలీ చేసి వచ్చిన డబ్బులతో తనకు సినిమాలు చూపించేవాడని భావోద్వేగానికి లోనయ్యాడు.
స్నేహితుడి కూలి డబ్బులతో సినిమాలు చూశా: సుకుమార్ - తెలుగు సినిమా వార్తలు
తన స్నేహితుడిని చూపిస్తూ స్నేహానికి ఎంత విలువిస్తాడో చాటిచెప్పాడు దర్శకుడు సుకుమార్. మిత్రుడు కూలి పని చేసి తెచ్చిన డబ్బులుతో సినిమాలు చూశానంటూ భావోద్వేగానికి లోనయ్యాడీ దర్శకుడు.
SUKUMAR EMOTIONAL ABOUT HIS FRIEND KISTAYYA
ఆ ఇష్టంతోనే సినిమా రంగంలో దర్శకుడిగా రాణించగలుగుతున్నానని తెలిపిన ఈ లెక్కల మాస్టారు.. తన స్నేహితుడికి రాజావారు రాణిగారు సినిమాలో నటుడిగా అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపాడు.
ఇవీ చూడండి.. షారూఖ్ కూతురి సినిమా చూశారా..!