తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బర్త్‌డే గిఫ్ట్‌ అదిరింది.. 'ఏఏ20' టీజర్ ఇదిగో..! - sukumar birthday

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. నేడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

sukuma
sukuma

By

Published : Jan 11, 2020, 1:51 PM IST

సుకుమార్‌ తన పుట్టినరోజు కానుకగా సినీప్రియులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ అందించాడు. తన కొత్త చిత్రం 'ఏఏ 20'కి సంబంధించి తొలి మేకింగ్‌ టీజర్‌ను బయటకొదిలింది చిత్రబృందం. 'ఆర్య', 'ఆర్య 2' వంటి హిట్ల తర్వాత బన్నీ- సుక్కుల కలయికలో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది.

తాజాగా విడుదల చేసిన మేకింగ్‌ టీజర్‌ను బట్టి ఈ చిత్ర షూటింగ్‌ కేరళ అడవుల్లో ఇప్పటికే ప్రారంభమైనట్లు అర్థమవుతోంది. అక్కడి అడవుల్లో సుందరమైన జలపాతాల వద్ద ఇప్పటికే కొన్ని కీలకమైన సీన్లను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఎర్ర చందనం దొంగల కథాంశంతో సరికొత్త థ్రిల్లర్‌ జోనర్‌ కోణంలో చూపించబోతున్నట్లు సమాచారం.

ఈ సినిమాలో బన్నీ ఎర్రచందనంను తరలించే లారీ డ్రైవర్‌గా దర్శనమివ్వబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అతడి లుక్‌ కూడా దీనికి తగ్గట్లుగా ఫుల్‌ రఫ్‌గా ఉండబోతుందట. ఈ చిత్రం కోసం అర్జున్ చిత్తూరు యాసలో తొలిసారి సంభాషణలు పలకబోతున్నాడు. ప్రస్తుతం 'అల వైకుంఠపురములో' చిత్ర హడావుడి ముగిసిన వెంటనే ఈ చిత్ర సెట్స్‌లోకి స్టైలిష్ స్టార్ అడుగుపెట్టనున్నాడట.

ఇవీ చూడండి.. ప్రభాస్‌ ఆ టైటిల్‌ వదులుకున్నట్లే..!

ABOUT THE AUTHOR

...view details