'రంగస్థలం' సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేశాడు దర్శకుడు సుకుమార్. ఆ చిత్రం తర్వాత ఈ దర్శకుడి నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట మహేశ్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అనివార్య కారణాల వల్ల అది వీలుకాలేదు.
అల్లు అర్జున్-సుకుమార్ సినిమా కథ అదేనా..! - sukumar
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ త్వరలోనే అల్లు అర్జున్‌తో ఓ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. అయితే ఇంతకుముందు మహేశ్ బాబుకు చెప్పిన స్టోరీతేనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
సుకుమార్
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు సుకుమార్. అయితే ఈ సినిమా కథ కోసం మహేశ్‌కు చెప్పిన స్టోరీ లైన్‌నే వాడుకున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రష్మిక మందణ్న హీరోయిన్గా నటించనుంది. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఇవీ చూడండి.. 'నిన్నుకోరి' దర్శకుడితో నాని మరోసారి..!
Last Updated : Sep 30, 2019, 7:25 PM IST