యువహీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య.. బాలీవుడ్లో నెపోటిజమ్‌తో పాటు ఉన్న పలు అంశాల్ని లేవనెత్తింది. ఈ నటుడు చనిపోవడానికి ఇండస్ట్రీలోని పలువురు బడా ప్రముఖులే కారణమని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ జీవితం ఆధారంగా సినిమా తీసేందుకు దర్శకుడు షమీక్ మాలిక్ సిద్ధమయ్యారు. 'సుసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వస్ లాస్ట్' పేరుతో తీస్తున్న చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వారు, ఎలాంటి కష్టాలు అనుభవిస్తారనే విషయాన్ని ఇందులో చూపించనున్నట్లు వెల్లడించారు.
"ఇది సుశాంత్ సింగ్ బయోపిక్ కాదు. బాలీవుడ్‌లోని ఎవరికి తెలియని కొన్ని విషయాల్ని ఇందులో చూపించబోతున్నాం. అతడు చనిపోవడానికి కారణమైన వారి గురించి చెప్పనున్నాం. గత కొన్నాళ్లలో సుశాంత్‌ను బెదిరించడం, నిషేధించడం సహా పలు సినిమాల నుంచి తప్పించారు" -షమీక్ మాలిక్, దర్శకుడు