టీవీ ఆన్ చేస్తే ఆ జోడీ డ్యాన్స్‌లు, జోకులు వినిపిస్తాయి. కనిపిస్తాయి! యూట్యూబ్, వెబ్‌సైట్స్ ఓపెన్ చేస్తే... వాళ్ల మీద రాసిన వార్తలే ఉంటాయి! వాళ్లే బుల్లితెర స్టార్స్ సుధీర్.. రష్మీ! 'జబర్దస్త్'తో ప్రతి ఇంట్లో వ్యక్తులుగా మారిపోయిన ఈ ఇద్దరి గురించి, వాళ్ల ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి వాళ్లంతట వాళ్లు చెప్పిన సందర్భాలూ చాలా తక్కువ. లాక్‌డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన సుధీర్, రష్మీ ఇటీవల సెట్స్‌లో అడుగుపెట్టారు. లాక్‌డౌన్ ముచ్చట్లు, వాళ్ల సొంత విషయాల గురించి ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి గతంలో వచ్చినప్పుడు పంచుకున్నారు.
మా వల్ల వాళ్లకు పని దొరుకుతుంది
ఈ కార్యక్రమంలో అలీ అడిగిన ప్రశ్నలకు సుధీర్, రష్మీ సమాధానమిచ్చారు. 'మీ ఇద్దరి గురించి వెబ్‌సైట్స్‌లో కథలు కథలుగా రాస్తుంటారు.. వాళ్లకు మీరు చెప్పే సమాధానం ఏంటి?' అని అలీ అడగ్గా.. "మా వల్ల వాళ్లకు ఏదో పని దొరుకుతుంది... డబ్బులు వస్తున్నాయి కదా అని ఆనందంగా ఉంటుంది. అలా రాయడం వల్ల వచ్చిన డబ్బుతో వాళ్ల కుటుంబం ఆనందంగా ఉంటుంది కదా అనిపిస్తుంది. నిజంగా మా మధ్య ఏముందా? లేదా అనేది మాకు తెలుసు" అని సుధీర్ చెప్పాడు.