కథానాయకుడు సుధీర్‌బాబు ఓ పక్క 'వి' సినిమా షూటింగ్‌లో పాల్గొంటూనే... మరోపక్క పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్, నాని నటిస్తున్న సినిమా 'వి'. ఇందులో నివేదా థామస్, అదితిరావు హైదరి కథానాయికలు. కొన్ని రోజులుగా ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
సుధీర్‌బాబు కసరత్తుల వెనుక కారణమిదే..! - పుల్లెల గోపీచంద్ బయోపిక్
బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం కసరత్తులు చేస్తున్నాడు హీరో సుధీర్‌బాబు. ఈ చిత్రం కోసం షటిల్ ప్రాక్టీసు చేస్తుండగా తీసిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నాడు.
సుధీర్‌బాబు కసరత్తుల వెనుక కారణమిదే..!
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లోనూ నటిస్తున్నాడు సుధీర్. ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రం కోసం సుధీర్ రాకెట్ పట్టి కోర్టులో శిక్షణ పొందుతున్నాడు. రోజూ బ్యాడ్మింటన్ సాధన చేస్తున్నాడు. గోపీచంద్ ఆట చూస్తూ కొన్ని మెళకువలు నేర్చుకుంటున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందించనున్నారు.