సినిమాటోగ్రఫీ చట్టం-2021 విషయంలో కేంద్రం పునరాలోచించాలని యువహీరో సుధీర్‌బాబు కోరారు. చట్ట సవరణతో భావ ప్రకటన స్వేచ్చ దెబ్బతింటుందని ట్విట్టర్లో రాసుకొచ్చారు. సినిమా రీ సెన్సార్స్ చేయడంలో కేంద్రీయ చలనచిత్ర ధ్రువీకరణ సంస్థ ఉండి ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. సెన్సార్ బోర్డు జారీ చేసే ధ్రువపత్రాల అధికారం కేంద్రం అధీనంలోకి తీసుకోవడం వల్ల సినిమా ప్రదర్శనలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు.
'అలా చేస్తే సెన్సార్ బోర్డు ఉండి ప్రయోజనమేంటి?' - సుధీర్‌బాబు మూవీ న్యూస్
తెలుగు హీరో సుధీర్‌బాబు కేంద్రం నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ నూతన చట్టం వల్ల సెన్సార్ బోర్డు ఉండి ప్రయోజనమేంటని ప్రశ్నించారు.
సుధీర్‌బాబు
ఇప్పటికే ఎన్నో విషయాల్లో సినిమాను లక్ష్యంగా పెట్టుకొని దాడులు చేస్తున్నారని సుధీర్‌బాబు ఆరోపించారు. సినిమాటోగ్రఫీ చట్ట సవరణ ఆమోదిస్తే సినిమాను లక్ష్యంగా చేసుకోవడం మరింత సులభతరమవుతుందని అన్నారు. సినిమా విషయంలో ప్రతిసారి భయపడే వాతావరణం అక్కర్లేదని తెలిపారు.
ఇవీ చదవండి: