దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి, కథానాయకుడు సుధీర్ బాబు కాంబినేషన్‌లో మూడో చిత్ర ఖరారైంది. 'సమ్మోహనం', 'వి' చిత్రాల తర్వాత మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. బెంచ్ మార్క్ స్డూడియోస్ పతాకంపై నిర్మితమవుతున్న తొలి చిత్రం ఇది. దీపావళి సందర్భంగా ఈ శుభవార్త ట్విటర్ వేదికగా పంచుకుంది నిర్మాణ సంస్థ.
ఆ దర్శకుడితో సుధీర్ ముచ్చటగా మూడో సినిమా - Sudheer babu kritisetti movie
హీరో సుధీర్ బాబు దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబోలో మూడో చిత్రం ఖరారైంది. ఇందులో హీరోయిన్గా 'ఉప్పెన' ఫేం కృతిశెట్టి ఎంపికైంది.
![ఆ దర్శకుడితో సుధీర్ ముచ్చటగా మూడో సినిమా Sudheer](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9545946-2-9545946-1605364712888.jpg)
సుధీర్
ఈ చిత్రంలో నాయికగా 'ఉప్పెన' భామ కృతిశెట్టి ఎంపికైంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు. టైటిల్ సహా ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇదీ చూడండి : దర్శకుడు కె.విశ్వనాథ్ ఇంటికి మెగాస్టార్ చిరంజీవి