టైటిల్‌తోనే ఆసక్తి రేపిన సినిమా 'వి'. సుధీర్‌బాబు, నాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్ ఈరోజు వచ్చేసింది. "తప్పు జరిగితే యముడు వస్తాడనేది నమ్మకం.. కానీ వీడొస్తాడనేది మాత్రం నిజం" అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చాడీ హీరో.
యముడు వస్తాడనేది నమ్మకం .... వీడొస్తాడనేది నిజం! - entertainment news
'వి' సినిమాలో హీరోగా నటిస్తున్న సుధీర్‌బాబు ఫస్ట్‌లుక్ అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ఇందులో రక్షకుడిగా నటిస్తున్నాడీ హీరో.
'వి' సినిమాలో సుధీర్‌బాబు
ఈ చిత్రంలో నాని.. ప్రతినాయక లక్షణాలున్న పాత్రలో కనిపించనున్నాడు. అదితీ రావు హైదరీ, నివేదా థామస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతమందిస్తున్నాడు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్‌రాజు నిర్మాత. ఉగాది కానుకగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
Last Updated : Feb 28, 2020, 2:57 AM IST